politics
Nara Lokesh Mocks YS Jagan
Nara Lokesh Mocks YS Jagan : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే ఏంటో, డీఎస్సీ అంటే అర్థం ఏంటో కూడా తెలియదని, రెండూ ఒకటే అని అనుకుంటున్నారంటూ మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై "ఎక్స్" వేదికగా లోకేశ్ పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పరీక్షలు నిర్వహిస్తుందో, ఆ విధి విధానాలేంటో కనీసం తెలియని జగన్ తన పాలనా కాలంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు రాకుండా పారిపోతున్నారని లోకేశ్ మండిపడ్డారు. పరీక్షల వ్యవస్థపై అవగాహన లేని జగన్ ప్రశ్నిస్తున్నారంటూ మంత్రి లోకేశ్ విమర్శించారు. ఈ మేరకు లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న జగన్‌కు డీఎస్సీ నియామకాలపై మాట్లాడే అర్హత లేదన్నారు. సభలో ఎదుర్కొనే ధైర్యం లేకనే బయట ప్రెస్‌మీట్ పెట్టి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేశ్ విమర్శించారు.
Read full article on Etv Bharat